మెండోరా, బతుకమ్మ : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ కలిగి ఉండాలని ఫిజికల్ డైరెక్టర్ నరేందర్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్సారెస్పీ పోచంపాడ్ లో హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ నరేందర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. తెలుగు ఉపాధ్యాయురాలు అరుణ దీవెనల ను తెలుగు భాష దినోత్సవం పురస్కరించుకొని సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రొద్దుటూరి మమతా, ఇన్చార్జ్ హెచ్ ఎం నజీముద్దీన్, మండల పిఆర్టియు ప్రెసిడెంట్ సురేందర్ , ధర్మపురి, భూపతి భూపతిరావు శుభ, సుధా, తిరుమల సురేఖ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.