వరద బాధితులకు డీఎల్ఎస్ఏ సాయం

0 15,433

కామారెడ్డి, బతుకమ్మ : ఇటీవల అకాల వర్షాలు, వరదల కారణంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎస్ఎస్ఏ) ముందుకు వచ్చింది. సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ సూర సుమలత మాట్లాడుతూ “ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పారా లీగల్ వాలంటీర్ల సహకారంతో తాత్కాలిక భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు మా అథారిటీ కృషి చేస్తోంది,” అని పేర్కొన్నారు. అత్యవసర అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యత ఇచ్చి సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. “సమయానికి సహాయం అందితే బాధితులకు కొంత ఊరట కలుగుతుంది. ప్రభుత్వం మరియు సంబంధిత శాఖల సహకారంతో మరిన్ని సేవలు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము,” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ మాయ సురేష్, డీఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి, పారా లీగల్ వాలంటీర్స్ ఎర్రోళ్ల నరేష్, బెండగారి విజయ్, కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ ఇతర డీఎల్ఎస్ఏ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.