మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిది నందు ఫోన్లు పోగొట్టుకున్న ఆరుగురికి శుక్రవారం ఫోన్లు అందజేసినట్లు మోర్తాడ్ ఎస్ఐ రాము తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చరవాణిలో పోగొట్టుకున్న వారి పిర్యాదుల మేరకు సీఈఐఆర్ పోర్టల్ నందు నమోదు చేసి పోర్టల్ ఆదారముగా 6 గురి సెల్ ఫోన్ల ఆచూకీ తెలుసుకొని రికవరీ చేసి ఫిర్యాదుదార్లకు అప్పగించినట్లు తెలిపారు.
