25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రతి పేదవాని కడుపు నిండాలని..

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడు మండలం డోన్ పాల్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సన్న బియ్యం పథకాన్ని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు నిజమైన ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. గతంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ ఎప్పుడు జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం వల్ల పేదలకు ఎంతో లబ్ధి కలగనుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సన్న బియ్యం పథకం కూడా చరిత్రలో నిలిచిపోయేలా ఉందన్నారు. శ్రీమంతులే కాదు పేద ప్రజలు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాని కడుపు నిండాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డులపై సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పర్సా దేవన్న, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Every poor person's stomach should be filled..

More articles

Latest article