ప్రతి పేదవాని కడుపు నిండాలని..
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడు మండలం డోన్ పాల్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సన్న బియ్యం పథకాన్ని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు నిజమైన ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. గతంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ ఎప్పుడు జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం వల్ల పేదలకు ఎంతో లబ్ధి కలగనుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సన్న బియ్యం పథకం...