- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికిపదవి విరమణ తప్పక ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మార్చ్ నెలలో పదవి విరమణ పొందిన సిబ్బందిని ఆయన గురువారం కమిషనర్ కార్యాలయంలో సన్మానించారు. నగరంలోని నాలుగో టౌన్ ఏఎస్ఐ కే.రాఘవేందర్ రావును పదవి విరమణ సందర్భంగా సన్మానించారు. పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటిరిమార్కు లేకుండాపదవి విరమణ చేయడం ఎంతో గోప్పవిషయమని అన్నారు. డిపార్టుమెంటల్కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని కొనియాడారు. పదవి విరమణ అనంతరం ఎలాంటి అవసరం వచ్చిన ఎల్లవేళల సహయపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంటు శంకర్, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి, అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, వారికుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
