31 C
Hyderabad

జడ్పీహెచ్ఎస్ లో ఆర్టిఐ న్యాయ చైతన్య సదస్సు 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో న్యాయ చైతన్య సదస్సు సమాచార హక్కు చట్టం 2005 పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం ముఖ్యఅతిథిగా మాజీ ద్వితీయ శ్రేణి జ్యుడీషియల్ న్యాయమూర్తి ఎంఏ సలీం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ విద్యతోపాటు వివిధ చట్టాల పైన విద్యా హక్కు చట్టం సహ చట్టం పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి కోర్టు  న్యాయవాదులు పి సతీష్ కుమార్, శ్రీనివాస్ రావు, ఆర్టిఐ భిక్కనూరు మండల అధ్యక్షులు బండ్ల ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయదేవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article