మాదకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత

0 14,543
  • డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం
  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మాదకద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యతని, డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దామని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల  సందర్భంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో పాత కలెక్టర్ కార్యాలయం  నుండి రాజీవ్ గాంధీ ఆడిటరియం వరకు ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాకు  ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. డ్రగ్స్ మహమారిని తరిమేద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దామని తెలిపారు.  మత్తు జీవితాన్నిచిత్తు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత ఆనందం కొరకు అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు.  పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2015 సంవత్సరం వరకు దాదాపు 15 లక్షల మంది ఈ డ్రగ్స్ కు బానిసలు అయినట్టు రికార్డులో ప్రకారంగా చేబుతున్నాయన్నారు.  ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం కష్టపడే వారు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేయాలని, యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు  కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు  వారి మానసిక స్థితిని కోల్పోయి  నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరము డ్రగ్స్ కు దూరంగాఉందాం బంగారు తెలంగాణ సాకారం చేసుకుందాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  ట్రైనింగ్ ఐఏఎస్ కరోలినా ఛాంగ్ ఎన్.మావీ , నిజామాబాదు అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) బస్వా రెడ్డి, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి , ఎక్సైజ్ సూపర్డెంట్ మల్లారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, నిజామాబాదు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి,  విద్యార్థులు, ఎన్సీసీ క్యాడేట్స్, అంగన్వాడీ టీచర్స్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Eradicating drugs is everyone's responsibility.

Leave A Reply

Your email address will not be published.