హైదరాబాద్, బతుకమ్మ:
తెలంగాణ ఇంజనీరింగ్,అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ( వెటర్నరీ) కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎప్ సెట్ -2026) ఫలితాలు వెలువడ్డాయి. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఎప్ సెట్ ఫలితాలు విడుదల చేశారు. తెలంగాణ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జేఎన్ టీయూ ఎప్ సెట్ ఎంట్రన్స్ ను నిర్వహించింది. మే 4,5 తేదిలలో అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రెన్స్ లు జరిగాయి,9,10,11 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించారు. ఫలితాలను విడుదల అనంతరం సంబంధిత ప్రవేశ పరీక్ష ఫలితాలు వెబ్ సైట్ లో పొందు పరిచినట్టు ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యోగితారాణా తెలిపారు. 97,241 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష రాశారు. 84, 954 అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు రాశారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ లో మహమ్మద్ కు స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంక్ సాయి , మూడో ర్యాంక్ సాహితి గీతిక, నాల్గవ ర్యాంక్ జయసింహ కు దక్కాయి.ఇంజనీరింగ్ లో 156.63 మార్కులతో తెలంగాణ తెలంగాణ టాపర్ గా ఉప్పల్ కు చెందిన ఎం . రూషి నిలిచారు. ముసాపేట్ కు చెందిన అన్షుల్ కు రెండో ర్యాంక్ సాధించిన. మూడో ర్యాంక్ కడప జిల్లా పులివెందుల కు చెందిన వంశీ రెడ్డి, నాల్గవ ర్యాంక్ ను గుంటూరు కు చెందిన జే రోషన్ మణిదీప్ రెడ్డి దక్కించుకున్నారు.
