27.5 C
Hyderabad
Friday, July 31, 2026

దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహా నాయకుడు

Must read

📰 Generate e-Paper Clip

  • టీఎమ్మార్పీఎస్ నాయకులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహా నాయకుడు మాజీ ప్రధాని, భారతరత్న, రాజీవ్ గాంధీ అని టీఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్, టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహనీయునికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్యాల గోవర్ధన్, మెండోరా మండలం అధ్యక్షుడు పాలెం వంశీ రాజ్, యువసేన నాయకులు సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article