అలరించిన చిన్నారుల వేషధారణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శ్రీ శ్రీ శ్రీ దుర్గామాత ఆలయంలో గుమస్తా కాలనీలో నిర్వహించిన చిన్నారుల వేషధారణ భక్తులను అలరించాయి. చిన్నారులు కృషుడు, గణపతి, పోతారాజు, అన్నపూర్ణ దేవి, గోపిక వంటి పలు వేషధారణల్లో పాల్గొని భక్తులను అలరించారు. పిల్లల అమాయక హావభావాలు, అందమైన వేషధారణలు చూసి భక్తులు మంత్ర ముగ్దులయ్యారు. సాంప్రదాయ విలువలను చిన్న వయసులోనే నేర్పించే ఈ తరహా కార్యక్రమాలు తల్లిదండ్రులు, పెద్దల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. ఆలయ వాతావరణం భక్తి, ఆనందం, సాంస్కృతిక కాంతులతో నిండిపోయింది. ఈ...