- ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య
మోపాల్,బతుకమ్మ : ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించి, రూ.600 కూలి చెల్లించాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. మోపాల్ గ్రామంలో ఉపాధి కూలీల పని క్షేత్రంలో గురువారం కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి యాక్ట్ ప్రకారం కూలీలకు కల్పించే వసతులు ఏమీ లేవని, పని క్షేత్రంలో నీడ వసతి గాని, నీటి వసతి గాని, మెడికల్ కిట్టు గాని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు గానీ లేవని అన్నారు. కూలీలకు వారానికి ఒక గ్రూప్ వారికి మాత్రమే పని కల్పిస్తున్నారని, కనీసం వందరోజుల పని దినాలలో 40 రోజులు కూడా పనులు కల్పించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు గత సంవత్సరం రోజుకు 300 రూపాయలు నిర్ణయిస్తే ఈ సంవత్సరం దానికి ₹రూ.7 పెంచి 307 రూపాయలు నిర్ణయించిందని కేవలం ఏడు రూపాయల పెంపు పెరుగుతున్న నిత్యవసర ధరలతో పోలిస్తే ఏమాత్రం సరిపోదని వారన్నారు. కూలీలకు పనిముట్లు అందజేయడం లేదని కనీసం గడపరా, పారా సరి చేయుటకు డబ్బులు ఇవ్వడం లేదని అన్నారు. గ్రామ ప్రాంతాలను మున్సిపల్ లో, నగరాలో కలపడం వల్ల ఉపాధి పనులు పొందిన కూలీలకు దీనివల్ల పనులు దొరకడం లేదు, ఈ రకంగా 50% కూలీలు పనులు కోల్పోయారు. పట్టణ వాసులకు కూడా ఉపాధి హామీ పనులు కల్పించాలని వారన్నారు. కూలీలకు రేషన్ ద్వారా తక్కువ ధరలకే పోషక విలువలు కలిగిన నిత్యావసర సరుకులు అందించాలని వరన్నారు. అర్హులైన ప్రతి కూలీకి ఉపాధి హామీ జాబ్ కార్డు ఇవ్వాలని అన్నారు. పనులు చేసిన కూలీలకు డబ్బులు సకాలంలో వారి ఖాతాలో జమ చేయడం లేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా సహాయకార్యదర్శి అగ్గు చిన్నయ్య, సీపీఐఎంఎల్ న్యూడేమోక్రసి మోపాల్ మండల కార్యదర్శి బండమీద నరసయ్య,ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎరన్న, చెగంటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

