ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలి
ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మోపాల్,బతుకమ్మ : ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించి, రూ.600 కూలి చెల్లించాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. మోపాల్ గ్రామంలో ఉపాధి కూలీల పని క్షేత్రంలో గురువారం కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి యాక్ట్ ప్రకారం కూలీలకు కల్పించే వసతులు ఏమీ లేవని, పని క్షేత్రంలో నీడ వసతి గాని, నీటి వసతి గాని, మెడికల్ కిట్టు గాని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు...