27.5 C
Hyderabad
Friday, July 31, 2026

తెయూ అడ్మిషన్  డైరెక్టర్ గా డా.వాసం చంద్రశేఖర్ నియామకం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ వర్సిటీ  అడ్మిషన్స్  డైరెక్టర్ గా డాక్టర్ వాసం చంద్రశేఖర్ ను నియమిస్తూ వైస్ _ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు, రిజిస్ట్రార్  ప్రొఫెసర్ ఎం. యాదగిరి  నియామకపు ఉత్తర్వులు అందజేశారు. డా. వాసం చంద్రశేఖర్  డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో  ఎన్ ఇ పి నోడల్ ఆఫీసర్ గా, రూసా కోఆర్డినేటర్ గా  విధులు నిర్వహిస్తున్నారు.  గతంలో  వాసం చంద్రశేఖర్ ఫార్మసిటికల్    విభాగం విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా, యూనివర్సిటీ  కళాశాల ప్రిన్సిపల్ గా, ఐ క్యు ఏసి  కోఆర్డినేటర్ గా, యూజీసీ డైరెక్టర్ గా విజయవంతంగా బాధ్యతలు  నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసం చంద్రశేఖర్  మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నియామకపు ఉత్తర్వులు అందించిన వైస్ ఛాన్స్లర్  ప్రొఫెసర్ టీ.యాదగిరిరావుకు, రిజిస్ట్రార్  ప్రొఫెసర్ యాదగిరి కి  కృతజ్ఞతలు తెలిపారు. వీరి నియామకం పట్ల తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్  అధ్యక్షులు డా.ఏ. పున్నయ్య,జనరల్ సెక్రెటరీ మోహన్ బాబు,  వైస్- ప్రెసిడెంట్ డా. మావురపు సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి డాక్టర్ నాగరాజు అడికే, నాగరాజు పాత,  శిరీష బోయపాటి  హర్షం వ్యక్తం చేశారు.

More articles

Latest article