. . . నాలుగు సంవత్సరాల నుండి ఫీజు బకాయిలు రాక కళాశాలల ఇబ్బందులు
కామారెడ్డి, బతుకమ్మ :
తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం పట్టణంలోని అన్ని డిగ్రీ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యాలు పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం టాస్క్ జిల్లా కన్వీనర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి వల్ల లక్షలాదిమంది విద్యార్థులు కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కోర్సులు పూర్తి అయిన ఫీజు బకాయలు రాకపోవడంతో కళాశాలలో సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. 2021 సంవత్సరం చెల్లించాల్సిన ఫీజు బకాయలు చెల్లించకుండా 2026 బకాయిలను విడుదల చేస్తానని చెప్పి విద్యార్థులను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కిందన్నారు.చరిత్రలో విద్యార్థులను,నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వాలు అన్ని అధికారాన్ని కోల్పోయాయని,అదే పరిస్థితి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తుందని అన్నారు.ప్రజా పాలన పేరుతో దగా పాలన చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల అధ్యాపకులు అమృత దత్తాద్రి,సాయిబాబా,కొడిపాక సత్యనారాయణ,విజయ్ కుమార్,మనోజ్ కుమార్,అనిల్ రెడ్డి,తిరుపతి రెడ్డి,బాబర్, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
