28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గణేష్ మండపాల వద్ద విద్యుత్ జాగ్రత్తలు తప్పక పాటించాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ ఎల్.సి తోట రాజశేఖర్

 

రుద్రూర్, బతుకమ్మ : గణేష్ మండపాల వద్ద ప్రతి ఒక్కరు  విద్యుత్ జాగ్రత్తలను పాటించాలని అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ ఎల్.సి తోట రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి పండగను అత్యంత ఆనందంగా వైభవంగా జరుపుకోవడానికి మనం విద్యుత్తు నుంచి భద్రత తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి విద్యుత్ మండపం వారు తప్పకుండా మా ఎలక్ట్రిసిటీ లైన్ మెన్ కు తెలియజేయాలన్నారు.  మీరెవరు కూడా కొండిలు వేసుకోవడానికి వీల్లేదని, మా విద్యుత్తు లైన్ మెన్ వచ్చి మీకు సరైనటువంటి కనెక్షన్ ఇస్తారని, మీరు మంచి ఐఎస్ఐ స్టాండర్డ్ సర్వీస్ వైరు, ఎంసిబి తీసుకోగలరన్నారు. అలాగే ఎత్తు కూడా చూసుకోవడం చాలా మంచిది కాబట్టి కింద ఎక్కడ కూడా వినాయక మండపాలు వేయకూడదన్నారు. విద్యుత్ దీపాలు, సిరీస్ లైట్స్ వేసేటటువంటి ఎలక్ట్రిషన్లకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ కూడా ఇన్సులేషన్ పోకుండా, జాయింట్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి వినాయక మండపాల ఇన్చార్జిలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి విద్యుత్ అవసరాలు ఉన్నా కానీ మా లైన్ మెన్ కు అయినా లేదా మాకు కూడా  లేదా 1912 సర్వీస్ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ అయినా సంప్రదించగలరన్నారు.

More articles

Latest article