28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బోధన్ మండలంలో బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్  : బోధన్ మండలంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. మండలంలోని పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ చేరిక కార్యక్రమం బోధన్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేకంగా హాజరై నేతలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెగడపల్లి మాజీ సర్పంచ్, ఎంపీటీసీ జయశ్రీ భూంరెడ్డి, సిద్ధాపూర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్, వార్డ్ మెంబర్లు, గ్రామ స్థాయి నాయకులు, సుమారు 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. కండువా కప్పిన వెంటనే కొత్తగా చేరిన నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించేది బీజేపీ మాత్రమేనని నమ్మకం వ్యక్తం చేశారు.

BRS suffers a severe setback in Bodhan Mandal

More articles

Latest article