26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కంట్లో కారం చల్లి, కత్తి తో బెదిరించి వృద్ధురాలి నగలు చోరీ

Must read

📰 Generate e-Paper Clip

నవీపేట, బతుకమ్మ : బస్టాండ్ లో వృద్ధురాలి కంట్లో కారం చల్లి, కత్తితో బెదిరించి ఓ మహిళ చోరీకి పాల్పడింది. ఈ ఘటన నవీపేట బస్టాండ్ లో చోటు చేసుకుంది. నారాయణపూర్ గ్రామానికి చెందిన కిష్టాబాయి తన గ్రామానికి వెళ్లేందుకు నవీపేట బస్టాండ్ కు వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు మూత్రశాలల వైపు వెళ్లగా ఓ మహిళ ఆమె వెనుకాలే వెళ్లి వృద్ధురాలి కంట్లో కారంచల్లి కత్తితో బెదిరించి నగలు లాక్కుంది. ఈ క్రమంలో వృద్ధురాలు కేకలు పెట్టడంతో మహిళ పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న వారు గమనించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article