. మూడు తులాల బంగారం
. రూ.50 వేల నగదు అపహరణ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని నాల్గో టౌన్ పరిధిలో ఉన్న పూలాంగ్ పాత బ్రిడ్జి వద్ద ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. చిన్నయ్య అనే వ్యక్తి ఈ నెల 23న కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ కు వెళ్లగా శనివారం తెల్లవారుజామున దుండగులు ఇంటి తాళలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాను ధ్వంసం చేసి అందులోని మూడు తులాల బంగారం, రూ.50 వేల నగదును ఎత్తుకెళ్లారు. అలజడికి పక్క ఇంట్లోనే ఉన్న చిన్నయ్య కుమారులు నిద్రలేవగా దుండగులు బైక్ లపై పరారయ్యారు. శనివారం ఉదయం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలాన్ని నగర సీఐ శ్రీనివాస్ రాజు, ఎస్సై శ్రీకాంత్ పరిశీలించారు. స్థానికంగా రహదారుల వెంబడి ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

