కంట్లో కారం చల్లి, కత్తి తో బెదిరించి వృద్ధురాలి నగలు చోరీ
నవీపేట, బతుకమ్మ : బస్టాండ్ లో వృద్ధురాలి కంట్లో కారం చల్లి, కత్తితో బెదిరించి ఓ మహిళ చోరీకి పాల్పడింది. ఈ ఘటన నవీపేట బస్టాండ్ లో చోటు చేసుకుంది. నారాయణపూర్ గ్రామానికి చెందిన కిష్టాబాయి తన గ్రామానికి వెళ్లేందుకు నవీపేట బస్టాండ్ కు వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు మూత్రశాలల వైపు వెళ్లగా ఓ మహిళ ఆమె వెనుకాలే వెళ్లి వృద్ధురాలి కంట్లో కారంచల్లి కత్తితో బెదిరించి నగలు లాక్కుంది. ఈ క్రమంలో వృద్ధురాలు కేకలు పెట్టడంతో మహిళ పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న...