- టిపిసిసి లీగల్ సెల్ ఛైర్మెన్ పొన్నం అశోక్ గౌడ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టిపిసిసి లీగల్ సెల్ ఛైర్మెన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. బందువుల వివాహానికి అశోక్ గౌడ్ ను రాష్ట్ర లీగల్ సెల్ కో కన్వీనర్ దయాకర్ గౌడ్ ఆధ్వర్యం లో బోధన్, నిజామాబాద్ న్యాయవాదులు గురువారం తమ బార్ అసోసియేషన్ కార్యాలయానికి మర్యాద పూర్వకంగా ఆహ్వానించి సన్మానించారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు సైతం కలిసి

సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయ వాదులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. న్యాయవాదుల సమస్యల పై స్పందించి పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యంగా న్యాయవాదుల హెల్త్ కార్డు లు అందరికీ వచ్చే విధంగా కృషి చేస్తానని, స్థలాలు అందుబాటు లో ఉన్న ప్రాంతాలలో న్యాయవాద హౌసింగ్ సొసైటీ ద్వారా సత్వరమే ఇండ్ల స్థలాలు పంపిణీ కి కృషి చేస్తానని హెల్త్ ఇన్స్యూరెన్స్ కవరేజీ పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు.

