24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మ దహనం

Must read

📰 Generate e-Paper Clip

ఎడపల్లి, బతుకమ్మ : బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పట్ల ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని నిరసిస్తూ గురువారం ఎడపల్లి మండల కేంద్రంలో ని ప్రధాన రహదారిపై అరవింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం తగదన్నారు. పార్లమెంట్ పరిధిలో ఎంపీ అరవింద్ ఎక్కడ పర్యటించారో తెలపాలన్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి జిల్లా రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం తగదు అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ చౌదరి, నీరడి రవికుమార్, బొబ్బిలి శ్రీనివాస్, కిషోర్, నవీన్, రాజ్ కుమార్, ప్రసాద్, సంజీవ్, ఎజాజ్, తాహెర్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article