29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్

 

ఆర్మూర్, బతుకమ్మ : ఉద్యోగులందరూ సంఘటితమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ సూచించారు. టిఎన్జీవో ఆర్మూర్ యూనిట్ కార్యాలయం లో బుధవారం యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు కుంట శశికాంత్ రెడ్డి, విశాల్ అధ్యక్షతన యూనిట్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్  నేతృత్వంలో.. రాష్ట్ర వ్యాప్త ఉద్యోగుల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, పరిష్కరిస్తూనే  ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఉద్యమ కార్యచరణను ఇదివరకే ప్రకటించామని తెలిపారు.  దాయాది దేశాల మధ్య ఏర్పడ్డ అనిచ్చి దృష్ట్యా ఉద్యమ కార్యచరణలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప, ఉద్యోగుల హక్కుల సాధన జరిగేంతవరకు ఉద్యోగుల  వెంటే ఉంటామని తెలిపారు. ఉద్యోగులందరూ ఉద్యోగ జేఏసీ కార్యచరణను అమలు చేయుటకు కృషి చేయాలని, ఎ శాఖలోనైనా  సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విధి నిర్వహణలో ఉద్యోగ బాధ్యతలు  నిర్వహిస్తూనే, ఉద్యోగ సంఘానికి సేవలు అందించినప్పుడే మనమందరం సంఘటితమై, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశానికి టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు అతిక్ , జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, జిల్లా కోశాధికారి దినేష్ బాబు, నిజాంబాద్ అర్బన్ యూనిట్ కార్యదర్శి మారుతి, భీమ్గల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్, సలహాదారులు వనమాల సుధాకర్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, సునీల్, వసతి గృహ సంక్షేమ అధికారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.మచందర్, ఆర్మూర్ యూనిట్ కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

Efforts to resolve employee problems

More articles

Latest article