నూతన ఉపాధ్యాయుల కు టీపీటీఎఫ్ హితవు
బతుకమ్మ, మాచారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు కృషి చేయాలని టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్ హితవు పలికారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వారు శుక్రవారం రిపోర్ట్ చేశారు. విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వారికి అభినందనలు తెలిపారు. టి పి టి ఎఫ్ అధికార మాసపత్రిక, కరపత్రాలను అందించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మీ వంతుగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా నియామకాలు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలలను త్వరగా కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కౌన్సిలర్ డాక్టర్ నాగభూషణం, జిల్లా కార్యదర్శి సిహెచ్ లింగం, సిహెచ్ లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు నలినీ దేవి, టి శ్రీనివాస్, రూప్ సింగ్, గోపి, శ్రీనివాస్, ప్రకాష్, నరేందర్, నారాయణ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి
