26.1 C
Hyderabad

ఎస్సారెస్పీ గేట్లు మూసివేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి 13,674 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దీంతో ఎస్సారెస్పీ గేట్లు మూసివేసి గోదావరిలోకి నీటి విడుదల నిలుపుదల చేశారు. ప్రాజెక్టు ప్రధాన కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 6800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1200 క్యూసెక్కు లు, వరద కాలువ ద్వారా 4083 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు లక్ష్మీ కాల్వ ద్వారా 150 క్యూసెక్కులు మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.
కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నాలుగు టార్బెన్ల ద్వారా 36.05 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్టు జెన్ కో డీ ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు.

More articles

Latest article