23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదని, విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి ఉందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోవడంతో ఇప్పటి వరకు 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోవడం ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి హాస్టళ్ల లో జరుగుతున్న ఘటనల పైన విచారణ చేయించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ, ఏబీవీపీ నాయకులు మహేశ్, రాము, అనిల్, విద్యార్థులు పాల్గొన్నారు.

Effigy of CM Revanth Reddy burnt

More articles

Latest article