24 C
Hyderabad
Sunday, August 2, 2026

బెస్ట్ అవైలేబుల్ స్కీంకు బకాయిల ఎఫెక్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • రెసిడెన్సియల్ స్టూడెంట్స్ వద్దు. . . డే స్కాలరే ముద్దు
  • బీఏయస్ రెసిడెన్సియల్ స్టూడెంట్లు మాకొద్దంటున్న కార్పోరేట్ యజమాన్యాలు
  • డబ్బులు తీసుకుని విద్యార్థులకు స్కూల్ బుక్స్ లను అమ్మిన యాజమాన్యాలు
  • ప్రభుత్వం పీజు బకాయిలు చెల్లించకపోవడంతో టీసీలు తీసుకోవాలని ఒత్తిడి
  • విద్యా సంవత్సరం ప్రారంభమై ఇరవై రోజులు గడిచిన ఇంటివద్దే విద్యార్థులు
  • రూ.20 వేలు ఇస్తేనే చదువు చెబుతామంటున్న ప్రైవేట్ స్కూల్స్

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థిని, విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ చదువులు అందించేందుకు ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం నీరు గారిపోతుంది. రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం బెస్ట్ అవైలేబుల్ కింద బోధించినందుకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లు విద్యార్ధులను పాఠశాలలకు అనుమతించడం లేదు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు వారాలు గడిచిన ఇప్పటికి విద్యార్థులు ఇంటివద్ద ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెల  16న రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలేబుల్ స్కీం కింద కార్పోరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు వారి తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేసినా ఇప్పటి  వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యార్థుల భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

బెస్ట్ అవైలేబుల్ స్కీం నిధుల కొరతతో రోడ్డు ఎక్కింది. విద్యా సంవత్సరం ప్రారంభమై  రోజులు గడుస్తున్న తల్లిదండ్రులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన ఫలితం శూన్యం. సమస్య పరిష్కారాన్ని అటుంచితే ఇంకా సమస్య జఠిలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు స్కూల్ యజమానులు టి సీ లు కూడా బకాయిలు వచ్చే వరకు ఇవ్వమని చెప్పి.. ఇప్పుడేమో రెసిడెన్సియల్ స్టూడెంట్స్ వద్దు.. డే స్కాలర్లు ముద్దని స్కూల్ యాజమాన్యాలు చెతులేత్తేశాయి. రెసిడెన్సియల్ స్టూడెంట్ల టి సీ లు తీసుకెళ్లండని తల్లిదండ్రులకు చెప్పేసారు. కేవలం డే స్కాలర్లకు మాత్రమే చదువు చెపుతామని, రెసిడెన్సియల్ స్టూడెంట్ల కోసం హాస్టల్ నడపడం మావల్ల కాదని అంటున్నారు. హాస్టల్ ఎత్తేసే యోచనలో స్కూల్ యజమానులు ఉన్నప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు స్కూల్ బుక్స్ కోసం రూ.6,000 ఎందుకు తీసుకుని వాటిని అంటగట్టారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వేల రూపాలు పెట్టి తల్లిదండ్రులు బుక్స్ తో పాటు యూనిఫామ్ లు, షూ, బ్యాగులు ఇతర స్కూల్ సారంజామ అంతా కొనుగోలు చేసాక ఉన్న ఫలంగా పిల్లల్ని తీసుకొం.. హాస్టల్ నడపడం మాతో కాదని చెప్పడం ఎంతవరకు సబబని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒకవేళ మీ పిల్లల్ని ఇక్కడే చదిపించాలంటే తల రూ.20వేల ఫీజు కడితే కంటిన్యూ చేస్తామని యజమానులు అంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఫీజు కట్టడానికి డబ్బులే ఉంటే మేము ఇక్కడ ఎందుకు ఎక్కడైనా మా పిల్లల్ని చేదివించే వారమని అంటున్నారు. ఈ స్కీం చెప్పడానికే ఫ్రీ స్కీమ్ అని ప్రతి యేడు పిల్లలకి  బుక్స్, బట్టలు మేమే కొనియిస్తున్నామని, దోబీ ఫీజు కూడా వేలాల్లో మేమే కడుతున్నామని వారు చెబుతున్నారు.

Effect of arrears on the Best Available Scheme

ఇప్పుడు ఫీజు కూడా కట్టాలంటే మావల్ల కాదని తల్లిదండ్రులు అంటున్నారు. పదవ తరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులు గత్యంతరం లేక ఫీజు కట్టెందుకు ఒప్పుకొన్నట్లు తెలిసింది. ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.20 వేలు తీసుకుని వారికి మాత్రం విద్యా బోధన ప్రారంభించినట్లు తెలిసింది. అది కుడా పదోతరగతి ఫలితాలలో బిఎఏస్ స్టూడేంట్ లను పరిగణలోకి తీసుకుంటారని వారిని అనుమతిస్తున్నారు అని చెప్పాలి. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి మా పిల్లలను ఆదుకోవాలని గత సోమవారం కలెక్టరేట్ వద్ద పిల్లలతో కలిసి ధర్నా చేసి మెమోరాండం ఇచ్చిన ఇప్పటి ఎలాంటి ఫలితం లేదని, కనీసం ఏం జరిగింది అన్న విషయం కూడా కలెక్టర్ ఆఫీస్ నుండి సమాచారం రాలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ అధికారులు నిమ్మకునేరేత్తినట్లు వ్యవహారిస్తున్నారని జిల్లాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికార పార్టీ నాయకులు ఎవ్వరు తమ పిల్లల సమస్య పై స్పందించకపోవడం పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంత పెద్ద సమస్య ఉన్న లంబాడా స్టూడెంట్ ఆర్గనైజషన్ మినహా ఇంత వరకు ఏ ఒక్క మాదిగ, మాల, బంజారా స్టూడెంట్ యూనియన్లు గాని, మండల, జిల్లా, రాష్ట్ర కుల సంఘాలు, ఆర్గనైజేషన్ కానీ స్పందించకపోవడం పై విద్యార్థుల తల్లిదండ్రులు మండి పడుతున్నారు. ఏది ఏమైనా తమ పిల్లల సమస్య తక్షణమే పరిష్కారం అయ్యి న్యాయం జరగాలని లేనిపక్షం లో ఛలోసెక్రెటరేట్ కార్యక్రమం తమ సొంత ఖర్చులతో చెయ్యాలని, ప్రభుత్వాన్ని నిలదొయ్యాలని తల్లిదండ్రులు యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Effect of arrears on the Best Available Scheme

More articles

Latest article