27.3 C
Hyderabad
Friday, July 31, 2026

తెలంగాణలో విద్యారంగం కుంటుబడింది : పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో విద్యారంగం కుంటుబడిందని పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి ఆరోపించారు. నగరంలోని నిఖిల్ సాయి హోటల్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ వర్క్ షాప్ గురువారం జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి గారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ విద్యారంగాన్నినిర్లక్ష్యం చేశాయన్నారు. నిరుద్యోగులు,ప్రైవేటు ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని  డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకే  ఉద్యోగా లిచ్చి కాంగ్రెస్ చేతులు దులుపుకుందన్నారు. యువవికాసం గ్యారంటీ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ తోనే యువతకు భవిష్యత్తు  : ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

బీజేపీ తోనే యువతకు భవిష్యత్తు  అని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. విద్యావంతులు ఆలోచనతో ఓటు వేయాలని సూచించారు. దేశం కోసం పనిచేస్తున్న పార్టీ అభ్యర్థులను మండలికి పంపించేందుకు సహకరించాలని కోరారు.

ప్రతిపక్షాలు కాంగ్రెస్ కు తొత్తులుగా మారాయి :  ఎమ్మెల్యే పాయల్ శంకర్

ప్రతిపక్షాలు కాంగ్రెస్ కు తొత్తులుగా మారాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యనించారు. పట్టభద్రులు, టీచర్ల సమస్యల పరిష్కారం బీజేపీ తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు. మండలి లో నిరుద్యోగుల తరపున గొంతు వినిపించేందుకు ఒక  అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

Education sector in Telangana is crippled: BJP MLC candidate for graduates Anji Reddy

Education sector in Telangana is crippled: BJP MLC candidate for graduates Anji Reddy
- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article