30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్ బతుకమ్మ :

 

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని పీఎంశ్రీ ఎంపిపిఎస్ పాఠశాలను శనివారం (డీఈవో) జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ సందర్శించారు. విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించాలనే ఉద్దేశంతో గ్లోబల్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్ వారు పాఠశాలకు అందించిన ప్రొజెక్టర్ ను డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, ఎంఈఓ శ్రీనివాస్, పిఎంశ్రీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Education in government schools is comparable to private schools...

More articles

Latest article