31.6 C
Hyderabad

ఐకేపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని సిద్ధాపూర్ గ్రామ సంఘం తరపున ఐకేపీ ఆధ్వర్యంలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ బక్కుల అనిత చందు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఐకెపి ఏపీఎం బస్వంత్ రావు మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని విక్రయించి దిగుబడి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శంకర్, గ్రామ సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి, సీసీ విఠల్, విఓఎ నవనీత, ట్యాబ్ ఆపరేటర్ వినాయక్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, రైతులు రామరావు, రాములు, శంకర్, జహీర్, రవి, దత్తు, దిగంబర్, సాయిలు, బాలరాజు, కృష్ణా, వెంకటి, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article