ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన…
రుద్రూర్ బతుకమ్మ : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని పీఎంశ్రీ ఎంపిపిఎస్ పాఠశాలను శనివారం (డీఈవో) జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ సందర్శించారు. విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించాలనే ఉద్దేశంతో గ్లోబల్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్ వారు పాఠశాలకు అందించిన ప్రొజెక్టర్ ను డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు...