విద్యాశాఖ స్థలాన్ని జిల్లా కోర్టుకు కేటాయించాలి
హైకోర్టు న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ వినతి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణానికి ఆనుకుని ఉన్న పూర్వ విద్యాశాఖ స్థలాన్ని జిల్లా కోర్టుకు కేటాయించాలని హైకోర్టు న్యాయమూర్తులు అలిశెట్టి లక్మి నారాయణ, జె.శ్రీనివాసరావు లకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుల నూతన భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి శనివారం హాజరైన న్యాయమూర్తులను కలిసి మాట్లాడారు. పెరిగిన కోర్టుల సంఖ్య,దానికి అనుగుణంగా న్యాయవాదుల,కోర్టుసిబ్బంది కక్షిదారుల వాహనాలు...