బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద రాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీలత కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక పాఠశాల బండా పల్లి, బొల్లక్ పల్లి, ప్రాథమికోన్నత పాఠశాల మద్దెల చెరువు పాఠశాల లను సందర్శించారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న సమ్మెటివ్ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు, తరగతి గదికి వెళ్లి పిల్లల ప్రగతిని పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలు ముగియగానే మార్కులు ఆన్లైన్లో నమోదు చేయాలని, యూ డైస్ లో పిల్లల ప్రొఫైల్ అప్డేట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గోపి, లక్ష్మి, సుంక్య, సిబ్బంది అరుణ్ కుమార్ , జ్యోతి లక్ష్మి, శోభ, మహేందర్ రెడ్డి, జ్యోతి, హన్మండ్లూ, శ్రీనివాస్, ఆ ప్రాంత క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గోపాల్ ఠాకూర్ పాల్గొన్నారు.