26.2 C
Hyderabad

బ్రేయిన్ ట్యూమర్ ముందస్తు గుర్తింపే ప్రాణరక్షణకు కీలకం

Must read

📰 Generate e-Paper Clip

. . . మెడికవర్ హాస్పిటల్ న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాదిత్య,

 నిజామాబాద్ , బతుకమ్మ:

బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులో అసాధారణంగా కణాలు పెరగడం వల్ల ఏర్పడే పరిస్థితి. ఇది నిరపాయ లేదా ప్రమాదకర స్వభావం కలిగి ఉండవచ్చు దానికి ముందస్తు గుర్తింపే ప్రాణరక్షణకు కీలకం అని మెడికవర్ హాస్పిటల్ న్యూరో సర్జన్ డా. శ్రీ కృష్ణాదిత్య అన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 8న  ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూరో సర్జన్ డా. శ్రీ కృష్ణాదిత్య మాట్లాడుతూ తరచూ తలనొప్పి రావడం, వాంతులు, మూర్ఛలు, చూపు మందగించడం, శరీర భాగాల్లో బలహీనత, నడకలో తడబాటు, జ్ఞాపక శక్తి తగ్గడం, ప్రవర్తనలో మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతాలు కావచ్చని పేర్కొన్నారు. బ్రెయిన్ ట్యూమర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, ఆధునిక వైద్య సాంకేతికతతో ఎంఆర్ఐ, సిటీ స్కాన్‌ల ద్వారా ఖచ్చితమైన నిర్ధారణ సాధ్యమవుతోందని తెలిపారు. ప్రస్తుతం మైక్రో సర్జరీ, న్యూరో నావిగేషన్, ఎండోస్కోపిక్ ,మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతుల ద్వారా మెదడు కణితులు సురక్షితంగా తొలగించే అవకాశం ఉందన్నారు. అవసరాన్ని బట్టి రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు కూడా అందిస్తున్నామని వివరించారు.ప్రజలు తలనొప్పిని సాధారణ సమస్యగా తీసుకుని నిర్లక్ష్యం చేయకుండా, లక్షణాలు కొనసాగితే వెంటనే న్యూరో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్లు పై అపోహలు తొలగించి, ముందస్తు నిర్ధారణ మరియు సమయానికి చికిత్స ద్వారా అనేక ప్రాణాలు  కాపాడవచ్చు తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్‌లో ఆధునిక న్యూరోసర్జరీ సేవలు, అత్యాధునిక నిర్ధారణ సదుపాయాలు నిపుణులు వైద్య బృందం తో బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

More articles

Latest article