బ్రేయిన్ ట్యూమర్ ముందస్తు గుర్తింపే ప్రాణరక్షణకు కీలకం

. . . మెడికవర్ హాస్పిటల్ న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాదిత్య,  నిజామాబాద్ , బతుకమ్మ: బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులో అసాధారణంగా కణాలు పెరగడం వల్ల ఏర్పడే పరిస్థితి. ఇది నిరపాయ లేదా ప్రమాదకర స్వభావం కలిగి ఉండవచ్చు దానికి ముందస్తు గుర్తింపే ప్రాణరక్షణకు కీలకం అని మెడికవర్ హాస్పిటల్ న్యూరో సర్జన్ డా. శ్రీ కృష్ణాదిత్య అన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 8న  ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూరో సర్జన్ డా. శ్రీ కృష్ణాదిత్య మాట్లాడుతూ తరచూ తలనొప్పి రావడం, వాంతులు, మూర్ఛలు, చూపు మందగించడం, శరీర భాగాల్లో బలహీనత, నడకలో తడబాటు, జ్ఞాపక శక్తి తగ్గడం, ప్రవర్తనలో...