26.3 C
Hyderabad
Monday, August 3, 2026

సర్పంచ్, ఉప సర్పంచ్ ల ముందస్తు అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: ఏర్గట్ల మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్ లను సోమవారం  ప్రొద్దున నాలుగు గంటల నుండి అక్రమంగా అరెస్టు చేసి ఏర్గట్ల పోలీస్ స్టేషన్ కు తీసుకొని రావడం పట్ల సర్పంచ్, ఉప సర్పంచ్ ల తరఫున బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం, మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సర్పంచ్ లు వర్క్ చేసిన బిల్లులను వెంటనే చెల్లిస్తామని, డాంబికాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం గడిచిపోయినా ఇప్పటివరకు నయా పైసా కూడా సర్పంచ్ లకు బిల్లులు చెల్లించకపోవడం వారి అబద్ధపు కోరు మాటలకు నిదర్శనం అని అన్నారు. సర్పంచ్ లు వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని తమ తమ గ్రామాల్లో ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులను చేయడం జరిగింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తూ పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని దీని కి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లు అందరూ నిరసన కార్యక్రమానికి పూనుకుంటే ఓర్వలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ అధికార బలంతో స్థానిక పోలీసులకు హుకుం జారి చెసి మసక చీకట్లో నాలుగు గంటల నుండి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్ లను ముందస్తు గా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తీసుక రావ డాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్ లా తరఫున బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. సర్పంచ్, ఉప సర్పంచ్ లు దొంగతనాలు చేయలేరు, దోపిడీ చేయలేరు మర్డర్లు చేయలేరు కానీ సమయం కాని సమయంలో అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదు అసలు ఇలాంటి అరెస్టులు బిఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు ఇట్లాంటి అరెస్టులకు భయపడకుండా రాబోయే రోజుల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ లకు గనుక పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే సర్పంచ్, ఉప సర్పంచ్ లతో కలిసి మహా ఉద్యమానికి శ్రీకారం చుడతాము, ఒకవేళ ప్రభుత్వం పద్ధతి మార్చుకోకుండా ఇదే విధమైనటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడితే పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు సర్పంచ్,ఉపసర్పంచ్ ల తరఫున బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేయడం జరుగుతుందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణానంద, మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పూర్ణానందం, మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ డాక్టర్ మధు, మాజీ సర్పంచ్, పత్తి రెడ్డి ప్రకాష్, భాను ప్రసాద్, ఉప సర్పంచ్ లు పాల్గొన్నారు.

More articles

Latest article