బతుకమ్మ,ఏర్గట్ల:మండల కేంద్రంలోని ఏర్గట్ల ఉన్నత పాఠశాలను జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రతి తరగతిలో ఉపాధ్యాయుల బోధన ను పరిశీలించి, ఇప్పటివరకు జరిగిన సిలబస్ గురించి ఉపాధ్యాయులను,అడిగి తగు సూచనలు చేశారు. స్కూల్ విద్యార్థులు భోజనం చేసే సమయంలో భోజన సదుపాయాలను, అడిగి తెలుసుకుని, భోజనాన్ని, కూరలను, పరిశీలించి డీఈవో అశోక్ స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు.వంట చేసే వంటశాల పరిసరాల్లో ఎలాంటి కలుషితం జరగకుండా చూడాలని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని సమకూర్చాలని తెలిపారు.అదేవిధంగా వివిధ రకాల రికార్డులను కూడా పరిశీలించి ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు తగిన సూచనలు,సలహాలు ఇవ్వడం జరిగింది.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ డీఈవో ఇచ్చిన సూచనలను సలహాలను పాటిస్తూ విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి మేమంతా కృషి చేస్తామని తెలియజేసి, డిఇఓ అశోక్ ను స్కూల్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారి శాలువాతో సత్కరించారు.