నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

0 14,581

 బతుకమ్మ, బోధన్: నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రతి పాఠశాలలో, కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా మాస్ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా స్థాయి ఈవెంట్‌లో భాగంగా బోధన్‌లోని ఉషోదయ జూనియర్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జిల్లా సంక్షేమ అధికారి (మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ) మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నియంత్రణ కోసం పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, విద్యాశాఖ, ఇంటర్మీడియట్ శాఖలతో కలిసి జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలలో ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మహిళా-శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సూపర్వైజర్లు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ, మత్తు పదార్థాలు, కల్లు, మత్తు పానీయాలకు అలవాటుపడి అనారోగ్యానికి గురవుతున్నవారికి జిల్లా ఆసుపత్రిలో మానసిక ఆరోగ్య వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు మాస్ అవేర్‌నెస్ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి రసూల్ బీ, బోధన్ ఎస్ హెచ్ ఓ వెంకట నారాయణ, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రావు, బోధన్ సీడీపీఓ పద్మ, ఎన్ఎంబీఏ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ షేక్ వసీం, డీహెచ్ఈడబ్య్లూ స్వప్న, ఎక్సైజ్ సిబ్బంది, పోలీసులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Drug-Free India Campaign

Leave A Reply

Your email address will not be published.