నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం
బతుకమ్మ, బోధన్: నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రతి పాఠశాలలో, కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా మాస్ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా స్థాయి ఈవెంట్‌లో భాగంగా బోధన్‌లోని ఉషోదయ జూనియర్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జిల్లా సంక్షేమ అధికారి (మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ) మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో మాదక ద్రవ్యాల...