తెయూ అడ్మిషన్  డైరెక్టర్ గా డా.వాసం చంద్రశేఖర్ నియామకం

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ వర్సిటీ  అడ్మిషన్స్  డైరెక్టర్ గా డాక్టర్ వాసం చంద్రశేఖర్ ను నియమిస్తూ వైస్ _ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు, రిజిస్ట్రార్  ప్రొఫెసర్ ఎం. యాదగిరి  నియామకపు ఉత్తర్వులు అందజేశారు. డా. వాసం చంద్రశేఖర్  డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో  ఎన్ ఇ పి నోడల్ ఆఫీసర్ గా, రూసా కోఆర్డినేటర్ గా  విధులు నిర్వహిస్తున్నారు.  గతంలో  వాసం చంద్రశేఖర్ ఫార్మసిటికల్    విభాగం విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘ...