రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీల్లో దళిత సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని, అంబేద్కర్ ఆశయాలు సమాజ సమానత్వానికి, సామాజిక న్యాయానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు.

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్సై సాయన్న రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయన్న, బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్, కన్నె ప్రవీణ్, శేఖర్, నరేందర్, ప్రవీణ్, దళిత సంఘాల నాయకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
