Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 7:54 pm Posted by : ramakrishna

డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు…

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీల్లో దళిత సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని, అంబేద్కర్ ఆశయాలు సమాజ సమానత్వానికి, సామాజిక న్యాయానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు.

 

Dr. Babasaheb Ambedkar's 135th birth anniversary celebrations...

 

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్సై సాయన్న రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో ఎస్సై సాయన్న, బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్, కన్నె ప్రవీణ్, శేఖర్, నరేందర్, ప్రవీణ్, దళిత సంఘాల నాయకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.