. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నిజామాబాద్, బతుకమ్మ: అభివృద్ధికి రాజకీయ పార్టీలు అడ్డుగా మారొద్దని, పార్టీలకతీతంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి నాయకులు ముందుకు రావాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో రేణుకాగౌడ సంఘ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. నగరంలో గౌడ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో చర్చించి నిజామాబాద్ లో గౌడ సంఘం అభివృద్ధి, భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక నిధులువెచ్చించి మంజూరు చేయిస్తామని అన్నారు. పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, స్థానిక కార్పొరేటర్ న్యాలం రాజు, డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, పీసీసీ మాజీ కార్యదర్శి నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
