. . . తమ సమస్యలపై అసెంబ్లిలో ప్రస్తావించండి
. . . పది వేల పెన్షన్ ఇప్పించండి
బాల్కోండ, బతుకమ్మ:
కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అయిన పేషంట్ లకు ప్రతి నెల మందులకు 10 వేల రూపాయలు పైగా ఖర్చు అవుతుందని కావున ప్రభుత్వం కిడ్నీ ట్రాన్సప్లాంట్ ,డయాల సీస్ పేషంట్ లకు ప్రతి నెల పెన్షన్ ఇప్పించండి. బాల్కొండ,ఆర్మూర్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల కిడ్నీ ట్రాన్సప్లాంట్,డయాల సిస్ బాధితులు మాజీ మంత్రి, బాల్కోండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిడ్నీ బాధితులం ప్రజాభవన్ కు వెళ్లి మా సమస్య పై వినతి పత్రం ఇచ్చామని ఎలాంటి స్పందన లేదు అని ఎమ్మెల్యేకు తెలిపారు. మా సమస్యలను, డిమాండ్ లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అసెంబ్లీ లో ప్రస్తావించాలని ఎమ్మెల్యే వేముల ను కోరారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ 43 ద్వారా కిడ్నీ బాధితులకు రూ.10 వేల రూపాయలు పెన్షన్ ఇస్తుందని ఇక్కడ కూడా అలాగే ఇచ్చేలా చూడాలన్నారు.