సామాజిక మాధ్యమాలకు బానిసలు కావద్దు

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నేటి యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావము  అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని ప్రిన్సిపల్ డా. ఇ.లక్ష్మీ నారాయణ  తెలిపారు. కళాశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ పోటీలలో కళాశాల స్థాయిలో మొదటి స్థానం పొందిన విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. సామాజిక మాధ్యమాలను విజ్ఞానం పెంపొందించుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలన్నారు.  పక్కదారి పట్టించే అంశాల జోలికి పోవద్దని, సామాజిక మాధ్యమాలకు...