23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట :  రైతులు ఆరు గాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి రైతులు నష్టపోవద్దని మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ దుందిగళ్ళ నర్సింలు అన్నారు. బుధవారం మాల్ తుమ్మెద సొసైటీ డైరెక్టర్లు, రైతులతో కలిసి మాల్ తుమ్మెద సొసైటీ పరిధిలోని మాల్ తుమ్మెద, గోలి లింగాల్, లింగంపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ గ్రేడ్ నరి ధాన్యానికి క్వింటాల్ కు 2320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్ కు 2300, సన్న రకం వరి ధాన్యానికి 2320 తో పాటు 500 రూపాయల బోనస్ అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు కృష్ణవేణి రాజారెడ్డి, సొసైటీ డైరెక్టర్ లు గుర్రాల సిద్దయ్య, శ్రీనివాస్ రెడ్డి,రామ కిష్టయ్య, సీఈఓ సందీప్ రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article