ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దు
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : రైతులు ఆరు గాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి రైతులు నష్టపోవద్దని మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ దుందిగళ్ళ నర్సింలు అన్నారు. బుధవారం మాల్ తుమ్మెద సొసైటీ డైరెక్టర్లు, రైతులతో కలిసి మాల్ తుమ్మెద సొసైటీ పరిధిలోని మాల్ తుమ్మెద, గోలి లింగాల్, లింగంపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ గ్రేడ్ నరి ధాన్యానికి క్వింటాల్ కు 2320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్ కు 2300,...