దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రైతులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఇన్ చార్జి ఎస్.జ్యోతి అన్నారు. బోర్గం పి తాడేం గ్రామంలో పీఏసీసీ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్ చార్జి ఎస్ జ్యోతి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యం రూ.2389 లకు, బి గ్రేడ్ కు రూ.2369 లకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు...