24.1 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీ రామాలయ పునఃర్నిర్మాణానికి దాతలు సహకరించాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో శ్రీ రామ మందిరం పునఃర్నిర్మాణ పనులు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయని శ్రీ రామాలయ కమిటీ సభ్యులు అన్నారు. సోమవారం శ్రీ రామాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రామాలయం కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ.. శ్రీ రామ మందిరం పునఃర్నిర్మాణానికి దాతలు సహకరించాలన్నారు. శ్రీ రామాలయ నిర్మాణ పనులు కొంత మేరకు పూర్తయ్యాయన్నారు. రామాలయ పునఃర్నిర్మాణ పనులకు ఇప్పటి వరకు విరాళాలు అందించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా చుట్టూ ప్రక్క గ్రామాల దాతలు కూడా సహకరిస్తే శ్రీ రామాలయ మిగతా నిర్మాణ పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలయ పూజారులు నారాయణ శర్మ, రాము శర్మ, బాను పంతులు, శ్రీ రామాలయ కమిటీ నిర్వాహకులు పత్తి రాము, అడప నవీన్, పత్తి నవీన్, తాటి పాముల హరీష్, కర్క అశోక్, అడప సాయిలు, ప్రశాంత్ గౌడ్, బచ్చు పవన్ సెట్, హనుమాన్ స్వాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article