శ్రీ రామాలయ పునఃర్నిర్మాణానికి దాతలు సహకరించాలి
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో శ్రీ రామ మందిరం పునఃర్నిర్మాణ పనులు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయని శ్రీ రామాలయ కమిటీ సభ్యులు అన్నారు. సోమవారం శ్రీ రామాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రామాలయం కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ.. శ్రీ రామ మందిరం పునఃర్నిర్మాణానికి దాతలు సహకరించాలన్నారు. శ్రీ రామాలయ నిర్మాణ పనులు కొంత మేరకు పూర్తయ్యాయన్నారు. రామాలయ పునఃర్నిర్మాణ పనులకు ఇప్పటి వరకు విరాళాలు అందించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా చుట్టూ ప్రక్క గ్రామాల...